రాజస్ధాన్ క్యాంపు రాజకీయాలకు తెర..!

157
rajasthan congress

రాజస్దాన్ రాజకీయ సంక్షోభం క్యాంపు పాలిటిక్స్‌కు తెరలేపాయి. సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్ ఫెయిర్ మోంట్‌కు తరలించారు. ఈ సమావేశానికి 107 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని కాంగ్రెస్ నేతలు తెలపగా అసంతృప్త నేత సచిన్ పైలట్‌తో ఢిల్లీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది.
పార్టీ అగ్రనాయకులు రాహుల్‌, ప్రియాంక, చిదంబరం, కేసీ వేణుగోపాల్‌…..సచిన్‌ పైలట్‌తో మాట్లాడి బుజ్జగింపు చర్యలకు దిగినట్లు సమాచారం.

తన వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వాలని, కీలక హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని, పీసీసీ చీఫ్‌గా తనను కొనసాగించాలని సచిన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తుండగా 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు.