‘అబె..సాలె’ అంటే గ్రీటింగ్ అనుకున్నా

75
Pichai did not know about “Abey and Saaley”

అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో తనదైన ముద్రవేసుకున్న భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్‌. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్‌..2004లో గూగుల్ సంస్థలో చేరి ప్రస్తుతం ఆ సంస్థకే సీఈవోగా కొనసాగుతున్నారు. ఐఐటీ- ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. గూగుల్‌కు సీఈవో అయిన తరవాత పిచాయ్ తొలిసారి ఖరగ్‌పూర్ ఐఐటీని ఇవాళ సందర్శించారు. ‘ఏ జర్నీ బ్యాక్ టు ది పాస్ట్ టు ఇన్‌స్పైర్ ది ఫ్యూచర్’ పేరుతో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు పిచాయ్.

తాను చదువుకునే రోజుల్లో హిందీ అంతంతమాత్రం వచ్చేదని….అందుకే కొంద‌రు అబె.. సాలె.. అని పిలిచినా అదేదో గ్రీటింగ్ అనుకునేవాడిన‌ని చెప్పారు. తాను కంప్యూట‌ర్‌ను తొలిసారి తాను ఇక్క‌డే చూసిన‌ట్లు చెప్పారు. రాత్రులు చాలాసేప‌టి వ‌ర‌కు మేల్కొనే ఉండి, ఉద‌యం క్లాస్‌ల‌కు వెళ్లేవాడిని కాద‌ని ఆయ‌న చెప్పారు. కాలేజీ చ‌దువులు మ‌రీ అంత ముఖ్యం కాద‌ని, అస‌లు చ‌దువు రిస్క్ తీసుకొనే త‌త్వాన్ని ప్రోత్స‌హించాల‌ని సుంద‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ల‌వ్‌స్టోరీని కూడా సుంద‌ర్ పిచాయ్ విద్యార్థుల‌తో పంచుకున్నారు.

Pichai did not know about “Abey and Saaley”

ఎంతో క‌ష్ట‌ప‌డితేగానీ ఐఐటీకి వ‌చ్చే అవ‌కాశం రాలేద‌ని, అయితే ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం క్లాస్‌ల‌ను బంక్ కొట్టేవాడిన‌ని సుంద‌ర్ గుర్తు చేసుకున్నారు. క్లాస్‌ల‌ను బంక్ కొట్ట‌డం కాలేజీ సాంప్ర‌దాయ‌మ‌ని కూడా అన్నారు. సుందర్ ఈ మాట అన్న‌పుడు విద్యార్థులు అరుపుల‌తో త‌మ మ‌ద్ద‌తు తెలిపారు.

త‌న‌ భార్య అంజ‌లిని ఈ క్యాంప‌స్‌లోనే చూసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే క్యాంప‌స్‌లో రొమాన్స్ చాలా క‌ష్ట‌మ‌య్యేద‌ని, గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌కు వెళ్లే చాన్సే ద‌క్కేది కాద‌ని గుర్తుచేసుకున్నారు. ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట నిల్చొని.. అంజ‌లి.. సుంద‌ర్ నీ కోసం వ‌చ్చాడు అని చెప్పేవార‌ని సుంద‌ర్ అన్నారు. 25 ఏళ్ల ముందు క్యాంప‌స్‌కు వ‌చ్చిన‌పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంద‌ని చెప్పారు. ఈ సందర్భంగా చాలామంది సుంద‌ర్ పిచాయ్‌ను చూడ‌టానికి వెనుక బెంచీల‌పై ఎక్క‌డం విశేషం.

Pichai did not know about “Abey and Saaley”

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై సైతం పిచాయ్‌ స్పందించారు. ఈ అంశంలో తాను నిపుణుడిని కాకపోయినా ఇది సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో గూగుల్‌ సంస్థ ఏ విధంగానైనా సాయం చేసే అవకాశముంటే అందుకు తాము సిద్దమని ప్రకటించారు.