మొక్కలు నాటడం ఒక అలవాటుగా చేసుకున్నాం..

50
Green Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. రంజిత్ రెడ్డి స్పూర్తితో తన 46వ జన్మదినాన్ని పురస్కరించుకుని తన కుమారులు వశిష్ట ఆర్య, అగస్త్యా ఆర్య లతో కలిసి 46 మొక్కలు నాటారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండేర్ రాఘవ మిత్రుడు మురళీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని తమ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తాము తమవంతు బాధ్యతగా మొక్కలు నాటడం ఒక అలవాటుగా చేసుకున్నామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి తన మిత్రుడు రాఘవకు కృతఙ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని కోరారు.