కింగ్ నాగ్‌ వదిలిన ‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్‌..

112

టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సీన్ టొవా స్టూడియోస్ – సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై జేపీఆర్ – స్టాలిన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ‘ఫ్రెండ్ షిప్’ మూవీ కరోనా వేవ్స్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కాస్త అదుపులోకి రావడంతో త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. సెప్టెంబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Friendship official Trailer | Harbhajan Singh, Arjun, Losliya, J Sathish Kumar | D.M.UdhayaKumar