సారంగదరియాకు అద్భుత రెస్పాన్స్

19
- Advertisement -

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమా జూలై 12న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. మాకు మంచి థియేటర్లు దొరికాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ఈ టీంలో అందరూ మెచ్యూర్డ్ పర్సన్స్. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు హ్యాపియెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన థియేటర్లలో నా చిత్రానికి ఇంత మంచి ఆధరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మొదటి రోజు తక్కువ మంది చూశారు. మౌత్ టాక్ వల్ల మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మంచి కథతో సినిమా తీశాం. మంచి కాన్సెప్ట్ అనే నమ్మకం ఉంది. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని కారెక్టర్‌లకు మంచి ఆధరణ లభిస్తోంది. మా దర్శకుడు సినిమా మీద ప్యాషన్ మస్కట్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడకు వచ్చాడు. ఈ ఒక్క కథలోనే మూడు కథలు రాసుకున్నారు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్ కథను ఎలా రాశారో అర్థం కాదు. టెక్నికల్ టీంతో చక్కగా పని చేయించుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. డీఓపీ గారు ఇచ్చిన విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేశారు. ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. ‘సారంగదరియా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కెమెరా డిపార్ట్మెంట్‌లో ముందుగా పని చేశాను. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. సినిమాను బాగానే తీశాం. థియేటర్‌ కోసమే ఈ సినిమాను తీశాం. మా నిర్మాత గారు చాలా సపోర్ట్ చేయడంతోనే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. డీఓపీ గారు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయన వల్లే ఇంత గ్రాండియర్‌గా సినిమా వచ్చింది. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని గారు చక్కగా నటించారు. రాజా సర్ అద్భుతంగా నటించారు. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

Also Read:అప్పుడు రకుల్..ఇప్పుడు ఆమె తమ్ముడు!

- Advertisement -