’35-చిన్న కథ కాదు’ ..అద్భుత రెస్పాన్స్

7
- Advertisement -

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపధ్యంలో హీరో విశ్వదేవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

35-చిన్న కథ కాదు ప్రిమియర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
– ప్రిమియర్స్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్ గా అందరూ సినిమా అద్భుతంగా వుందని చెప్పడం చాలా ఆనందంగా వుంది. విమర్శకులు, ప్రేక్షకుల ముక్త కంఠంతో సినిమాని ప్రశంసిస్తున్నారు. సినిమాకి అందరూ డిస్టింక్షన్ మార్కులు వేశారు.

ఈ సినిమా కోసం దాదాపు నెల రోజులు వర్క్ షాప్ జరిగిందని విన్నాం ?
-సినిమాలో డైలెక్ట్ ట్రైనింగ్, స్క్రిప్ట్ రీడింగ్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం. క్యారెక్టర్స్ పై ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. క్యారెక్టర్ ఆర్క్ ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఎక్కువగా డిస్కర్షన్ చేసుకునేవాళ్ళం.

-డైరెక్టర్ నంద కిషోర్ క్యారెక్టర్ లో ప్రతి ఆర్క్ ని చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేశాడు. సినిమాని అద్భుతమైన కన్విక్షన్ తో తీశాడు.

కెరీర్ బిగినింగ్ లోనే ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది ? స్టీరియోటైప్ అవుతుందేమో అని అలోచించారా ?
-స్టీరియోటైప్ అనేది ప్రతి ఇండస్ట్రీలో వుండే సమస్యే. అయితే దాన్ని చేంజ్ చేయవచ్చని నమ్ముతాను. సినిమా అనేది మ్యాజిక్. రెండుగంటల్లో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇలాంటి బలమైన మీడియంని కరెక్ట్ గా వాడుకుంటే ఎలా అయిన మలుచుకోవచ్చు. నా నుంచి రాబోయే కొత్త సినిమా క్యారెక్టర్ చూసి కొందరు ‘అసలు ప్రసాద్ ఇలా మారిపోయాడేంటీ’ అని షాక్ అవుతున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు మరింత అండర్ స్టాండింగ్ గా వున్నారు. కొత్తదనం చూపడం మన చేతుల్లోనే వుంటుంది.

-35-చిన్న కథ కాదు లో నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే ప్రసాద్ పాత్ర చేయాలని అనుకున్నాను. ప్రతి యాక్టర్ కి ఒక బలం వుంటుంది. ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేయాలనేది నా ప్రయత్నం.

నివేద థామస్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-నివేద థామస్ చాలా సపోర్ట్ చేశారు. నేను కొత్త వాడిననే ఫీలింగ్ కలిగించలేదు. ప్రతి ఒక్కరూ సినిమాకి ఏం చేయగలమనే అలోచించారు. నికేత్, వివేక్ సాగర్ ఇలా స్టార్ టెక్నిషియన్స్ అంతా ఒక వేవ్ లెంత్ లో పని చేశారు. అందుకే సినిమా అవుట్ పుట్ ఇంత అద్భుతంగా వచ్చింది.

Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

-గౌతమీ గారు, భాగ్యరాజ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి చాలా వాల్యు యాడ్ చేశారు. గౌతమీగారు ఎపుడూ సెట్ లోనే ఉంటూ అందరితో కలివిడిగా వుండటం చాలా నచ్చింది. వారి నుంచి చాలా నేర్చుకున్నాను.

-చైల్డ్ ఆర్టిస్ట్స్ గా చేసిన చిల్డ్రన్స్ కూడా అద్భుతమైన కన్విక్షన్ తో యాక్ట్ చేశారు. వారి పెర్ఫార్మెన్స్ నాకు హెల్ప్ అయ్యింది. తిరుపతి, వెంకన్న స్వామి నేపధ్యం ఒక డివైన్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. అన్నీ అర్గానిక్ గా అద్భుతంగా కుదిరాయి.

రానా గారి ఇన్వాల్మెంట్ ఎలా వుంటుంది ?
-మంచి కథలని ఎంచుకోవడంలో రానా గారు ఎక్స్ పర్ట్. మంచి కథలు, కొత్త కథలు చెప్పాలనే తపన ఆయనలో వుంటుంది. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే సృజన్, సిద్ధార్థ్ చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. సినిమా అంటే పాషన్ వుంటేనే ’35-చిన్న కథ కాదు’ లాంటి మంచి సినిమాని తీయడం కుదురుతుంది.

మీ కెరీర్ లో ’35-చిన్న కథ కాదు’ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
-ఇప్పటివరకూ నేను చేసినవన్నీ బావున్నాయనే జోన్ లోనే చేశాను. అదిరిపోయిందనుకునే సినిమా మాత్రం’35-చిన్న కథ కాదు’. నా కెరీర్ లో అన్ని విషయంలో తృప్తిని ఇచ్చిన సినిమా ఇది.

-వివేక్ సాగర్ తో కెరీర్ బిగినింగ్ నుంచి వర్క్ చేయాలని వుండేది. అది ఈ సినిమాతో కుదిరింది. గుర్తుపెట్టుకునే మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నికేత్ లాంటి స్టార్ డీవోపీ తో వర్క్ చేయడం ఆనందంగా వుంది

-ఈ సినిమాని ఇప్పటికే వందసార్లు చూసుంటాను. ఇప్పుడు ఆడియన్స్ కి కలసి చూస్తున్నపుడు కూడా ఎమోషన్స్ సీన్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమాలో అన్నీ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి.

ఇలాంటి సినిమాలు స్టూడెంట్స్ కి స్పెషల్ షోలు వేస్తుంటారు .. మీకు అలాంటి ప్లాన్స్ ఉన్నాయా?
-సినిమా అందరికీ నచ్చుతుంది. అడల్ట్స్ కి కనెక్ట్ అవుతుంది. అడల్ట్స్, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన బ్యూటీఫుల్ సినిమా ఇది.

- Advertisement -