నిరుద్యోగులకు శుభవార్త..

146
ts
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్తను అందించింది సర్కార్. 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా శాఖల వారీగా ఖాళీలకు సంబంధించి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది.

ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు పెంచింది. తాజాగా సడలించిన గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుందని పేర్కొంది.

2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉండగా పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు వర్తిస్తుంది.

- Advertisement -