తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ 2021 జూలై నుంచి వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఖజానాపై రూ. 300 కోట్ల అదనపు భారం పడనుంది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరునెలలకు ఒకసారి డీఏను ప్రకటించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచలేదు. దీంతో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ఒకే సారి ప్రకటించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.