తొలివన్డేలో కోహ్లీ సేన చిత్తు..

91
sa

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలివన్డేలో భారత్ చిత్తైంది. 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 8 వికెట్లు కొల్పోయి 265 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా భారత్‌పై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ 79,విరాట్ కోహ్లీ 51 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇక అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన సఫారీలు తొలుత తడబడ్డ తర్వాత రాణించారు. కెప్టెన్ బావుమా 110,రాస్సి వాన్ డెర్ డ‌స్సెన్ కేవ‌లం 96 బంతుల్లో 129 ప‌రుగులు చేసి దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో లీడ్‌లో ఉంది.