షారుఖ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్సే

23
- Advertisement -

దర్శకుడు ప్రశాంత్ నీల్ – బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కాంబోపై గూస్ బంప్స్ అప్డేట్ అందింది. కాంబో సెట్ అవ్వడంతో పాటు డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. షారుక్ ఖాన్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. ‘పఠాన్, జవాన్ సినిమాలు’ తర్వాత షారుఖ్ ఖాన్ రేంజ్ మారిపోయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా సక్సెస్ కావడంతో పాటు తన ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాడు షారుఖ్. నెక్ట్స్ అందరి చూపు షారుఖ్ కొత్త సినిమా పై ఉన్న విషయం తెలిసిందే.

ఎట్టకేలకు తన కొత్త చిత్రం పై షారుఖ్ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ – షారుక్ ఖాన్ కాంబినేషన్ సెట్ అయ్యింది. సన్ పిక్చర్స్, షారుక్ ఖాన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారు. జవాన్ సినిమాకి కూడా అనిరుధ్ రవిచంద్రనే మ్యూజిక్ అందించారు. అనిరుధ్ వర్క్ షారుక్ కి బాగా నచ్చింది. అందుకే, ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి ఏరికోరి మరీ అనిరుధ్ రవిచంద్రన్ ను తీసుకున్నాడు.

కాకపోతే, ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ కాదు. 2025 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలి అని, 2026 సమ్మర్ లో వరల్డ్ వైడ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ప్రశాంత్ నీల్ – షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు శ్రుతి హాసన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా నిజంగానే బయటకు వస్తే షారుఖ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్సే.

Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -