రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..

5
- Advertisement -

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది రైల్వే శాఖ. ఇప్పటివరకు రైల్వే సేవల కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే తాజాగా రైల్వే సేవలు అన్నిటిని ఒకే గొడుగు కిందకు తెచ్చింది.

‘రైల్ వన్’ పేరుతో సరికొత్త ఆల్-ఇన్-వన్ సూపర్‌ యాప్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుందని, కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ముగింపు పలకవచ్చని రైల్వే శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.

రైలు సేవలను ఆధునీకరించేందుకు మరియు సరళతరం చేసేందుకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైల్‌వన్ (RailOne)’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ ఆల్-ఇన్-వన్ డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రయాణికులకు టిక్కెట్లు బుక్ చేసుకోవడం నుంచి ప్రయాణ ప్రణాళిక, భోజన ఆర్డర్ వరకు అనేక సేవలను సులభంగా అందించడానికి లక్ష్యంగా రూపొందించబడింది.

ఈ యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల బుకింగ్, రైలు సమాచార విచారణ & పిఎన్ఆర్ స్టేటస్, రైలు సహాయ సేవలు, ట్రైన్‌లో భోజనం బుకింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. Android Play Store మరియు iOS App Storeలో అందుబాటులో ఉంది.

Also Read:మేడారం మహాజాతర..తేదీలివే

- Advertisement -