ఏకంగా ఎయిర్ ఫోర్స్ రన్‌వేను అమ్మేశారు ఓ తల్లి, కొడుకు. 28 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ జిల్లా ఫట్టువాలా గ్రామంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ విభానికి చెందిన 15 ఎకరాల ఎయిర్ స్ట్రిప్‌ను, 1997లో రెవెన్యూ అధికారుల సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేశారు ఉషా అన్సాల్, ఆమె కుమారుడు నవీన్ చంద్.
వరల్డ్ వార్-2 సమయంలో నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌ను అక్రమంగా అమ్మేశారని, నిషాన్ సింగ్ అనే రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. 2021లో హల్వారా ఎయిర్ ఫోర్స్ కమాండంట్ డీసీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, హైకోర్టు జోక్యంతో భూమిని స్వాధీనం చేసుకుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
దేశ భద్రతకు భంగం కలిగించే అంశమని వ్యాఖ్యానించింది పంజాబ్, హర్యానా హైకోర్టు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దేశ భద్రతకు భంగం కలిగించే విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది పంజాబ్, హర్యానా హైకోర్టు.
Also Read:గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగం

