డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి గుడ్‌ న్యూస్‌..

68
- Advertisement -

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారా.. చలానాలు పెండింగ్‌లో ఉన్నాయా.. అయితే మీకు ఇది గుడ్‌ న్యూసే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి విధించిన జరిమానాల్లో భారీ రాయితీలు ప్రకటించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వారికి ఇప్పటి వరకు జైలు శిక్షలు విధిస్తుండగా ఇకపై జరిమానాలతోనే సరిపెట్టాలని నిర్ణయించారు.

అయితే ప్రత్యేక లోక్ అదాలత్‌ల ద్వారా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాల్లోనూ మార్చి 12 వరకు లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -