‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజ‌ర్ డేట్‌ ఫిక్స్‌..

148
- Advertisement -

మాస్‌ మహారాజా ర‌వితేజ తాజాగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీకీ డెబ్యూట్ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మార్చి 1న మంగ‌ళ‌వారం సాయంత్రం 4.05 నిమిషాల‌కు టీజ‌ర్ విడుదల చేయ‌నున్నారు. దీంతోపాటు స్పెష‌ల్ రిలీజ్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు మేకర్స్.

రామారావు ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. రామారావు డిజిట‌ల్ హ‌క్కుల‌ను సోనీలివ్ భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

- Advertisement -