రివ్యూ: గుడ్ లక్ సఖి

438
keerthi suresh
- Advertisement -

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు.

కథ :

సఖి (కీర్తి సురేష్) పేదింటి అమ్మాయి. తాను గురిచూసిన ఏ వస్తువునైనా కొట్టగలదు. చిన్నతనం నుంచే సఖి టాలెంట్ ను గుర్తించిన ఆమె స్నేహితుడు గోళీ రాజు ( ఆది పినిశెట్టి) ఆమెలో నమకాన్ని పెంచుతాడు. సీన్ కట్ చేస్తే సఖికి కల్నల్ (జగపతిబాబు)తో పరిచయం,ఆమెకు కోచ్‌గా మారి ట్రైనింగ్ ఇవ్వడం, ఈ క్రమంలో ఆమె తన ప్రత్యర్థులను తట్టుకుని ఎలా నిలబడి విజేతగా నిలిచింది అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్‌ కీర్తి సురేష్ నటన. ఈ సినిమాకి వందశాతం న్యాయం చేసింది కీర్తి. కల్నల్‌గా జగపతిబాబు నటన భేష్. నాటకాలు వేసుకునే రామారావుగా తన పాత్రలో ఒదిగిపోయాడు ఆది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రఘుబాబు, రాహుల్ రామకృష్ణ కామెడీ సూపర్బ్.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ స్లో నేరెషన్,కథనం. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, కథ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. విజువల్ గా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. దేవీ శ్రీ సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు :

లేడి ఒరియెంటెడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. కీర్తి సురేష్,ఆది పినిశెట్టి నటన సినిమాకు ప్లస్ కాగా బోర్ గా సాగే కథనం మైనస్ పాయింట్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ గుడ్ లక్ సఖి.

విడుదల తేదీ :28/01/2022
రేటింగ్ : 2.25/5
నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: సుధీర్ చంద్ర ప‌దిరి
దర్శకత్వం : నగేష్ కుకునూర్

- Advertisement -