KTR:స్వపరిపాలనలో సుపరిపాలనా…

59
- Advertisement -

తెలంగాణ విజయవంతంగా 9వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…అధికార వికేంద్రీకరణతో పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర జనాభా సుమారు 4కోట్లు అని అన్నారు. దీనిలో కోటి 25లక్షల మంది హైదరాబాద్‌లో ఉన్నారని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స్థానికంగానే అధికారులు ప‌రిష్క‌రించాల‌న్న‌దే సీఎం కేసీఆర్ సంక‌ల్పం. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు రావ‌డ‌మంటే ఆ వ్య‌వ‌స్థ‌లో లోప‌మున్న‌ట్లు లెక్క కేటీఆర్ తెలిపారు. కరోనా కాలంలో కూడా హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాయని కేటీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ డిపార్ట్‌మెంట్ పనిచేయడం థ్యాంక్‌లెస్ జాబ్‌ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ప్రపంచంలో అద్భుతమైన టోక్యో నగరంలా హైదారాబాద్ మారిందని తెలిపారు.

Also Read: KTR:ప్రజలందరికీ స్వపరిపాలనా ఫలాలు..

హైద‌రాబాద్‌లో ప్ర‌తి రోజు 8 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను లిఫ్ట్ చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. పొడి చెత్త ద్వారా క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాం. త‌డి చెత్త ద్వారా రూ. 200 కోట్లు సంపాదిస్తున్నాం. హైద‌రాబాద్‌లో మురుగునీటిని శుద్ధి చేస్తున్నాం. న‌గ‌రంలో అద్భుత‌మైన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో 3 శాతం కంటే త‌క్కువ జ‌నాభా ఉన్న తెలంగాణ జాతీయ అవార్డుల్లో 30 శాతం సాధించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో మిష‌న్ భ‌గీర‌థ‌ను అధికారులు విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Also Read: కేసీఆర్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి..

- Advertisement -