- Advertisement -
పసిడి ధర మరింత దిగొచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.45,440కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,650కి చేరాయి. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ.71,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1714 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.53 శాతం క్షీణతతో 26.04 డాలర్లకు చేరింది.
- Advertisement -