బీజేపీని పట్టభద్రులు తరిమికొట్టాలి: ఎర్రబెల్లి

141
dayakar rao errabellli

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి బీజేపీని పట్టభద్రులు తరిమికొట్టాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో నిర్వహించిన పరకాల నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించే బాధ్యత మీదేనన్నారు. బీజేపీ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతున్నది..చిల్లర మాటలు మానుకోకపోతే,ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. బీజేపీ ఓట్ల కోసం మభ్య పెడుతుంది తప్ప వారితో మన రాష్ట్రం అభివృద్ధి జరుగదన్నారు.

మన జిల్లాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరి ను కావాలని బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కి తరలించారు…ప్రభుత్వం తరుపున స్వయంగా 150.05 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్వయంగా నా చేతుల మీదుగా రైల్వే శాఖ వాళ్లకు అప్పగించాను…ఇప్పటి వరకు స్థలం కూడా కేటాయించని యూపీకి ఫ్యాక్టరీ కేటాయిస్తారా అని ప్రశ్నించారు. దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ లాంటి పథకాలను ప్రజలు అందరూ అభినందిస్తున్నారు…నేను ఎమ్మెల్యే ధర్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకులకు,కార్యకర్తలకు అండగా ఉంటాం అన్నారు. సీఎం కెసిఆర్,మంత్రి కేటీఆర్ ల ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం…ఒక్కసారి సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూడండి…బీజేపీ వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు.