బంగారం ధరలకు బ్రేకులు!

124
gold price

బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. రెండురోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.55,460 వద్దనే నిలకడగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు..నిలకడగానే కొనసాగుతోంది.

బంగారం ధర నిలకడగా కొనసాగితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండిపై రూ. 800 పెరిగి 67800గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరిగి 1947 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.97 శాతం తగ్గుదలతో 26.88 డాలర్లకు క్షీణించింది.