పసిడి పరుగు ఆగడం లేదు.భగభగమంటూ రోజురోజుకు బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. ఓ వైపు బంగారం ధర పెరుగుతున్న వెండి ధర మాత్రం ధీనికి భిన్నంగా నిలకడగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,650 నుంచి రూ.39,800కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,160 నుంచి రూ.43,420కు చేరింది.
బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. ఈ రెండు రోజుల్లో ధర ఏకంగా రూ.780 పెరగడం గమనార్హం. కేజీ వెండి ధర రూ.49,900 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సహా పలు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు పసిడి పరుగుకు దోహదపడతాయని తెలిపారు. రానున్న రోజుల్లో బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000 మార్క్‌కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనా వేస్తున్నారు.