పసిడి ధరలు రోజురోజుకి పెరుగుపోతున్నాయి. పెట్టుబడి దారులకు ఇది శుభవార్తే అయినా.. కొనుగోలు దారులకు కొలుకోలేకపోతున్నారు. రానున్న రోజుల్లో బంగారం కొనాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతోంది.ముఖ్యంగా పాకిస్తాన్లో పుత్తడి ధర వింటే గుండె గుభేలుమంటుంది.
అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. నిన్న (సోమవారం ,ఆగస్ట్ 12) పాకిస్తాన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.
24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి. కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి.
అలాగే దేశీయంగా బంగారం రేట్లు రూ. 38వేలు మార్క్‌ను అధిగమించాయి. ఇక త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెండి కూడా దాదాపు ఇందే రేంజ్లో పరుగులు పెడుతోంది.