పసిడి ధరకు రెక్కలు…పదేండ్ల గరిష్టానికి!

192
gold
- Advertisement -

పసిడి ధరకు రెక్కలొచ్చాయి. పదేండ్ల గరిష్టానికి బంగారం ధర చేరింది. 2011 తర్వాత బంగారం ధర గరిష్ట స్ధాయికి చేరుకోవడం ఇదే తొలిసారి కాగా ఈ ఏడాది 17 శాతం పెరిగాయి బంగారం ధరలు.

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.370 పెరిగి ఏకంగా రూ.51 వేలకు చేరువైంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర మరో రూ.723 పెరిగి రూ.49,898 పలికింది.

అయితే వెండి ధర మాత్రం రూ. 100 తగ్గి కిలో వెండి ధర రూ.50,416గా ఉంది. గ్లోబల్‌ రేట్లకు తోడు డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం బంగారం ధరలు పెరుగడానికి ప్రధాన కారణం కాగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి ధర స్వల్పంగా తగ్గింది.

- Advertisement -