- Advertisement -
వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పతనమయింది.
గత రెండు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.1,340 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.39,270 నుంచి రూ.37,930కు దిగొచ్చింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.42,860 నుంచి రూ.41,780కు క్షీణించింది.
కేజీ వెండి ధర గత రెండు రోజుల్లో రూ.1,900 పడిపోయింది. దీంతో ధర రూ.51 వేల నుంచి రూ.49,100కు దిగొచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో బంగారం ధర పడిపోయింది. దీంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడింది.
- Advertisement -