ట్విట్టర్ రివ్యూ: అల వైకుంఠపురములో

551
ala vaikuntapurramlo
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చేసింది. సినిమా ప్రివ్యూ చూసిన వారు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

తన నటనతో స్టైలిష్‌ స్టార్‌ బన్నీ ఇరగదీస్తే…త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. సంక్రాంతి బరిలో సూపర్‌ హిట్ సినిమానే అంటున్నారు.

ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ తన నటనతో చించేశాడట. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సూపర్బ్ అని ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

అయితే కొంతమంది మాత్రం సెకండాఫ్ బోరింగ్‌గా ఉందని చెబుతున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ గ్లామర్‌ షోకు పరిమితమయ్యారని చెబుతున్నారు. మొత్తంగా సంక్రాంతి రేసులో బొమ్మ హిట్‌ అని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -