భారీగా తగ్గిన బంగారం ధరలు..

230
gold rate
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,890 తగ్గడంతో.. రూ.51,050కు చేరగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,730 తగ్గుదలతో రూ.46,800కు చేరింది.

అయితే బంగారం ధర తగ్గుముఖం పట్టినా వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.61,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1903 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 24.34 డాలర్లకు దిగివచ్చింది.

- Advertisement -