పెరిగిన బంగారం ధర!

244
gold rate
- Advertisement -

నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.52,370కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.48,050కు చేరింది.

బంగారం బాటలోనే వెండికూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2300 పెరిగి రూ.59,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.68 శాతం తగ్గి 1864 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.95 శాతం తగ్గుదలతో 22.97 డాలర్లకు చేరింది.

- Advertisement -