భారీ వర్షాలు…అధికారుల సెలవులు రద్దు

170
somesh kumar

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారుల సెలవులు రద్దు చేసిన సర్కార్ ప్రజలకు ఎప్పటికప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించింది.

వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ పరిస్థితులు తెలుసుకొని, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తుండగా రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.