డ్రగ్స్‌ కేసు విచారణకు హాజరైన దీపికా..

168
deepika

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణే,శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు హీరోయిన్ రకుల్.

తాజాగా ఇవాళ విచారణకు హాజరయ్యారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే. ముంబైలోని సిట్ ఆఫీసుకు చేరుకున్న దీపికను విచారిస్తున్నారు అధికారులు. ఇక దీపికతో పాటు సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌ను ఇవాళ విచారించనున్నారు ఎన్సీబీ పోలీసులు.

దీపిక మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌ను విచారించగా ఆమెను ఇవాళ కూడా మ‌ళ్లీ విచారించే అవ‌కాశాలు ఉన్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తితో జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ ఆధారంగా ర‌కుల్‌, క‌ర్మిషాల‌ను ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే.