- Advertisement -
బంగారం మరింత దిగొచ్చింది. వరుసగా మూడోరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.54,050గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గి రూ.49,480కు పడిపోయింది.
బంగారం బాటలోనే వెండికూడా బారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.1200 తగ్గి రూ.65,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిన దేశీయ మార్కెట్లలో తగ్గడం విశేషం. పసిడి ధర ఔన్స్‌కు 0.48 శాతం పెరిగి 1932 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.83 శాతం పెరిగి 26.48 డాలర్లకు చేరింది.
- Advertisement -