రూ.2000 నోట్ల ముద్రణకు బ్రేక్..

190
rbi

రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆపేసినట్లు వెల్లడించింది ఆర్బీఐ.ఈ మేరకు వార్షిక నివేదికలో కీలక ప్రకటన చేసింది. గత ఆర్ధిక సంవత్సరం (2019-20)లో రూ.2వేల నోటు ముద్రణే లేదని …రూ.2వేల నోటు చలామణి కూడా మూడేండ్లుగా క్రమేణా తగ్గిపోతున్నదని స్పష్టం చేసింది.కరోనా ప్రభావంతోనూ కరెన్సీ నోట్ల చలామణి బాగా పడిపోయిందని ఇది ముద్రణపై ఎఫెక్ట్ చూపిందని వెల్లడించింది.

గత ఆర్థిక సంవత్సరం 2,96,695 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. వీటిలో ఆర్బీఐ 4.6 శాతం గుర్తించగా, మిగతా 95.4 శాతం వివిధ బ్యాంకులు కనిపెట్టాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నకిలీ కరెన్సీ భారీగా పెరిగినట్లు తేలింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆర్బీఐ తెలిపింది. నిలకడైన వృద్ధి కోసం మరిన్ని సంస్కరణలు అవసరం అని… దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంలోప్రభుత్వానిదే కీలకపాత్ర అని వెల్లడించింది. వాతావరణ మార్పులు దేశ వ్యవసాయ రంగానికి దెబ్బేనని…సెప్టెంబర్‌దాకా మందగమన పరిస్థితులే ఉంటాయని తెలిపింది ఆర్బీఐ.