మరోసారి పసిడి రేటు పైపైకి..

80
- Advertisement -

బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ ఒడుదుడుకుల నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశానంటాయి.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముడిచమురు బ్యారెల్ ధర 139 డాలర్లకు చేరుకున్నప్పుడు ద్రవ్యోల్బణం భయంతో అప్రమత్తమైన మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు. అయితే, ముడి చమురు ధర మళ్లీ 100 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు బంగారం, వెండిలో విక్రయాలు జరిపారు.

అయితే, శుక్రవారం బ్యారెల్ ముడిచమురు ధర 120 డాలర్లకు చేరడంతో ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 2069 డాలర్లకు చేరడంతో అప్పుడు దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ. 55 వేలు దాటి రూ. 55,100కు చేరుకుంది.

అలాగే కిలో వెండి ధర రూ. 72,900కు పెరిగింది. అయితే, ఈ నెల 15న మరోమారు చమురు ధర తగ్గడంతో బంగారం ధర రూ. 53 వేలకు దిగొచ్చింది. అయితే, శుక్రవారం మరోమారు ఔన్స్ బంగారం ధర 1995 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయ విఫణిలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53,680కి చేరింది. వెండి ధర కిలో రూ. 70,500కు పెరిగింది.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుందని తెలుసుకోవాలి.

- Advertisement -