శ్రీశైలం ఘంటామఠంలో బంగారు నాణేలు లభ్యం..

132
Gold Coins

శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠంలో ఆదివారం బంగారు నాణేలు లభ్యమైయ్యాయి. ఘంటా మఠం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా 15కు పైగా బయట పడిన బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటితో పాటు ఒక బంగారు ఉంగరం కూడా లభ్యమైంది. దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్‌, ఎస్సై హరిప్రసాద్‌ సిబ్బందితో వచ్చి వాటిని పరిశీలించారు. అక్కడ దొరికిన నాణేలను,రింగును గోల్డ్ అప్రయిజర్‌తో తనిఖీ చేయించారు. దీనిపై పూర్తి వివరాలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు.