జై భీమ్ దర్శకుడి మరో రియల్ స్టోరీ!

22
tj
- Advertisement -

జై భీమ్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు TJ జ్ఞానవేల్. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది. దీంతో జ్ఞానవేల్ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

జ్ఞానవేల్ జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై హిందీలో ‘దోశ కింగ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధంకాగా ఈ చిత్రం ద్వారా ఓ మహిళ 18ఏళ్లుగా ఓ పారిశ్రామిక వేత్త, సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తిపై సుధీర్ఘ పోరాటం సాగించి విజయం సాధించిన తీరును ప్రపంచానికి తెలియజేసేందుకు జ్ఞానవేల్ సిద్ధమయ్యారు.

పి. రాజగోపాల్…. శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్ జిల్లాలో ఓ మారుమూల పల్లెల్లో రైతు కుటుంబంలో పుట్టిన రాజగోపాల్.. హోటల్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తరువాత శరవణ భవన్ పేరిట 22 దేశాల్లో 111 రెస్టారెంట్లను నిర్వహించారు.

- Advertisement -