ఆంధ్రప్రదేశ్ ను పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ది చేయాలని తమ కమిటి నివేదికలో సూచించినట్లు తెలిపారు విశ్రాంత ఐఏఎస్ అధికారి , కమిటి కన్వీనర్ జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దిపై సీఎం జగన్ కు నేడు తుది నివేదిక సమర్పించారు. అనంతరం జీఎన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు.
అసెంబ్లీ తూళ్లూరులోనే ఉండాలని సూచించినట్లు తెలిపారు. , వేసవికాలంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరాతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని, అమరావతి, మంగళగిరిలో రాజ్ భవన్, మంత్రుల నివాసాలకు, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు చెప్పారు. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం. రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం అన్నారు.