కరిష్మా శర్మ పై హిందీ సినీ లోకం దయ చూపలేదు గానీ.. స్టార్ హీరోయిన్ మెటీరియల్ ఆమె. తనకు దక్కాల్సిన ఆ స్టార్ ధగధగలు దక్కలేదని కరిష్మా శర్మ ఎప్పుడు నిరుత్సాహ పడుతూ ఉంటుంది. భారీ అవకాశాల మెరుపులను అందుకోవాలని ఆమె ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పరిధి దాటి అందాల విందు పరుస్తూ ఉంటుంది. దాంతో ట్రోలర్స్ కరిష్మా శర్మ పై విరుచుకు పడుతూ ఉంటారు. వారికి దీటుగా కరిష్మా శర్మ కూడా సీరియస్ అవుతుంది. తాజాగా కరిష్మా శర్మ మరోసారి ఫైర్ అయింది.
అసలు అందమైన భామలు గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటే తప్పేంటని కరిష్మా శర్మ ప్రశ్నించింది. సెక్సీ బాడీ ఉన్నప్పుడు సెక్సీ డ్రెస్సులు ఎందుకు వేసుకోకూడదు అంటూ కరిష్మా శర్మ లాజిక్ లు మాట్లాడుతుంది. తనకు మంచి బాడీ ఉందని.. తాను ఓ మంచి సెక్సీ, గ్లామర్ డ్రెస్ వేసుకుంటే ట్రోల్ చేస్తారని.. ఇది దారుణమని కరిష్మా శర్మ ఎమోషనల్ అవుతుంది.
రీసెంట్ గా కరిష్మా శర్మ మేకోవర్ అయింది. తన హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. సహజంగానే కరిష్మా శర్మ అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఉంటుంది. పైగా ఈ కొత్త మేకోవర్ లో ఆమె అదనపు ఆకర్షణలతో కనిపిస్తోంది. కరిష్మా శర్మ తాజాగా వదిలిన బికినీ ఫొటోలే అందుకు ఉదాహరణ. ఇక కరిష్మా శర్మ బికినీ వేసుకున్నప్పుడల్లా ఆమెను ట్రోల్ చేయడానికి ట్రోలర్స్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆమెను ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి…