విశాల్ పెళ్లి ఆగిపోలేదుః విశాల్ తండ్రి జీకే రెడ్డి

557
Vishal Anisha
- Advertisement -

తమిళ్ హీరో విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనిశా రెడ్డితో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్ధం అయి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి కాకపోవడంతో విశాల్ పెళ్లిపై పలు పుకార్లు వెలువడ్డాయి. విశాల్ అనిశాల పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను ఖండించారు విశాల్ తండ్రి సినీ నిర్మాత జీకే రెడ్డి.

ముందుగా నిర్ణయించిన విధంగానే విశాల్-అనీశాల పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదన్నారు. నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసి.. అదే భవన్‌లో విశాల్ పెళ్లి చేసుకుంటారని చెప్పారు.గురువారం చెన్నైలో దమయంతి చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో జీకే రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.

- Advertisement -