తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి

509
harish rao
- Advertisement -

తడి, పొడి చెత్తలను వేరు వేరు బుట్టలలో వేసి ఇవ్వాలని కోరారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మార్నింగ్ వాక్ లో భాగంగా సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించారు మంత్రి. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ, వేరుచేయడం లాంటి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

harish

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలను వేరుచేసి.. శానిటేషన్‌ సిబ్బందికి అందించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెత్త బుట్టలను సక్రమంగా వినియోగించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి, పొడి చెత్తలను ఒకే బుట్టలో వేయరాదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గోన్నారు.

- Advertisement -