ఛాంపియన్స్ ట్రోఫీలో డక్ వర్త్ లూయిస్ పద్దతిపై దక్షిణాఫ్రికాపై గెలిచినప్పటికీ.. భారత్‌తో పాకిస్థాన్ ఓడడాన్ని పాకిస్థానీలు తట్టుకోలేకపోతున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ దేశ మీడియా దుమ్మెత్తి పోసింది. మ్యాచ్‌కి ముందు పాక్ సారథి సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పలు పత్రికలు దుమ్మత్తిపోశాయి. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థాన్ విలేఖరి చేసిన ఓ ట్వీటు ఇప్పుడు పాకిస్థానీలను మాత్రం ఆకట్టుకుంది.
పాక్‌కు చెందిన నజ్‌రానా గఫర్ అనే మహిళా విలేఖరి చేసిన ట్వీటు ఇది. ‘ఏడాది పాటు భారత క్రికెట్ జట్టు సారథి కోహ్లీని మాకు ఇవ్వండి. అందుకు బదులుగా 11మందితో కూడిన పాక్ జట్టును భారత్‌కు ఇస్తాం’ అని అన్నారు.
పాకిస్థానీలు దీనిని రీట్వీట్ చేస్తూ హోరెత్తించగా…భారతీయులు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. ఓ అభిమాని ‘క్షమించండి. మీ ఆటగాళ్లను జింబాబ్వే కూడా తీసుకోదు’ అని రిట్వీటు చేయగా… ‘కే అంటే కశ్మీర్, కే అంటే కోహ్లీ.. రెండూ మీకే కావాలా. ఈ రెండింటిని భారత్ మీకివ్వదు’ అని మరో అభిమాని కౌంటర్ ఇచ్చాడు.. దయచేసి గాడిదలను గుర్రాలతో పోల్చవద్దని.. పాక్ క్రికెటర్లు మరో రెండు తరాలైనా టీమిండియాకు సాటిరారని నెటిజన్లు స్పష్టం చేశారు.
మరోవైపు గ్రూప్-బిలో తన రెండో మ్యాచ్‌లో గురువారం శ్రీలంకతో తలపడనున్న టీమిండియా.. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసింది. ఇక ఆరంభం నుంచి టోర్నీని వెంటాడుతున్న వాన ఈ మ్యాచ్‌కూ ఆటంకం కలిగించే ప్రమాదముంది. భారీ వర్షం కురిసే అవకాశాలు 40 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కారణంగా భారత్ జట్టు సాధన కూడా చేయలేకపోయింది.