ఎస్ ఆర్ నగర్ హాస్టల్ లో విద్యార్ధిని అనుమానస్పద మృతి

522
Girl Death
- Advertisement -

ఎస్ ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. హస్టల్ లోని గదిలో విద్యార్ధిని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గొగులపాటి స్పందన అనే విద్యార్ధి 5నెలల క్రితం కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. అమీర్ పేట్ లో కోచింగ్ తీసుకుంటూ ఎస్ ఆర్ నగర్ లోని కావేరి హాస్టల్ లో ఉంటుంది.

కాగా ఈరోజు ఉదయం ఆమెతో పాటు రూంలో ఉంటున్న అమ్మాయి డ్యూటీకి వెళ్లగా, మరో అమ్మాయి బయటకు వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చింది. రూం డోర్ కొడుతుండగా ఎంతకీ తీయకపోవడంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే వారు రూం చేరుకొని డొర్ ను పగులగొట్టగా అనుమానాస్పద స్థితిలో స్పందన మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. దీంతో వెంటనే హస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిస్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -