బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనే లిస్ట్ తీస్తే..సల్మాన్ ఖాన్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరినడిగినా టక్కున చెప్పేస్తారు. సల్మాన్‌కు ఉండే ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇందులో అమ్మాయిలు సంఖ్య కూడా బలంగానే ఉంటుంది. ఇక దీంతో పాటు వీళ్లలో కొందరి వల్ల సల్మాన్‌కు వచ్చే ఇబ్బందులు కూడా అదే విధంగా ఉంటాయి. ఇటీవల ఓ యువతి సల్మాన్ ఇంటిపైకి ఎక్కి తనను సల్మాన్ పెళ్లి చేసుకోవాలని హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి మరో యువతి కూడా వచ్చి చేరింది.
డెహ్రాడూన్‌కు చెందిన 24ఏళ్ళ యువతి తన ఇంట్లోంటి పారిపోయింది. కారణం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ను పెళ్ళిచేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయి ముంబయి చేరుకుంది ఆ యువతి. ముంబయి చేరుకొని సల్మాన్ ఖాన్ ఇంటిని శోధించి …ఆ ఇంటి చుట్టూ తిరుగుతుండటంతో పోలీసులు ఆమెను ఆరాతీశారు.
సల్మాన్‌ను పెళ్లిచేసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. అయితే ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో పోలీసులు ఆరాతీసి కుసుమ్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుసుమ్ తండ్రి ముంబయి లోని సల్మాన్ నివాసం వద్దకు చేరుకుని కుసుమ్ మానసిక పరిస్థితి బాగోలేదని, ప్రస్తుతం తను వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఇలా సల్మాన్ కోసం ఇంటినుంచి పారిపోవడం నాలుగోసారని పోలీసులకు తెలిపారు. అనంతరం తమ కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.