ఇటీవల కాలంలో మద్యంమత్తులో నగర వీధుల్లో బీభత్సం సృష్టిస్తున్న యువతుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటనలో తప్పతాగిన ఇద్దరు యువతులు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా… ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసి నానా హంగామా చేశారు. ఈ ఘటన చండీఘర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే చంఢీగడ్ లో ఇద్దరు యువతులు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాఫిక్ సిగ్నళ్లను జంప్ చేసి వెళుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న 29 ఏళ్ల యువతి స్వయంగా పోలీసు సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా వెళ్లి పోయింది. మరో సిగ్నల్ వద్ద వారిని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. వార్నింగ్ ఇచ్చి పంపిద్దామన్న పోలీసులతో గొడవకు దిగారు అమ్మాయిలు. అప్పటికే ఫుల్‌గా తాగుండంతో.. కారులోంచి ఓ అమ్మాయి బీరు బాటిల్ తీసుకొని తలమీద పగలకొట్టుకుంది. ఆ తర్వాత పక్కనున్న వారు వారిస్తున్నా వారిద్దరూ ఏ మాత్రం తగ్గకుండా… పోలీసులపై ఇద్దరూ కలిసి దాడికి దిగారు.
మరోవైపు అప్పటికే సాయంత్రం అవుతుండడంతో, వారిని అరెస్ట్ చేయవద్దంటూ డ్యూటీ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తెల్లవారే వరకు వేచి చూసిన పోలీసులు… ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి.. మరుసరి రోజు ఉదయం వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ తతంగాన్ని అక్కడున్న స్థానికులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
https://youtu.be/d4ZFgvJBdqw