డ్రంక్ అండ్ డ్రైవ్..ఎంతమంది దొరికారో తెలుసా?

149
- Advertisement -

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు చాలామంది పట్టుబడ్డారు. గ్రేటర్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా మొత్తం 5819 మంది పట్టుబడ్డారు. పోలీసులు మందు బాబుల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారి లైసెన్స్ రద్దు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 1103 లైసెన్స్‌లు, సౌత్ జోన్ పరిధిలో 1151 లైసెన్స్‌లు, వెస్ట్ జోన్‌లో 1345 లైసెన్స్‌లు, ఈస్ట్ జోన్‌లో 510 లైసెన్స్‌లతోపాటు, సెంట్రల్ జోన్‌లో కూడా పలువురి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేశారు.

గతేడాది ఇదే సమయంలో 3220 లైసెన్స్‌లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వారితో పోలిస్తే, ఈ ఏడాది దొరికిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -