కన్నడ సాహిత్యానికే వన్నెలద్దిన గిరీష్ కర్నాడ్‌..

39
- Advertisement -

అధునిక కన్నడ సాహిత్యానికి సేవ చేసిన వాళ్లలో ఒకరు గిర్నీష్ కర్నాడ్. ఈయన మే 19,1938న మాథేరన్ బొంబాయి ప్రెసిడెన్సీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి రోడ్స్ స్కాలర్‌గా తత్వశాస్త్రం రాజకీయాలు ఆర్థిక శాస్త్రాలను అభ్యసించారు. ఈయన రాసిన మొదటి నాటకం యయాతి(1961)గాను విమర్శకుల ప్రశంసలు పొందింది.

1970లో సంస్కార్ అనే సినిమా ద్వారా చలన చిత్ర రంగంలో అడుగుపెట్టారు. భారతీయ నాటక రచయితగా నటుడిగా చలనచిత్ర దర్శకుడిగా తన ప్రతిభను కళామాతల్లికి అంకితం చేశారు. కర్నాడ్‌ సినిమాల్లో చెప్పుకొదగినది తబ్బలియ నీనాడే మగనే ఒండనోండు కాలదల్లి ప్రఖ్యాతి చెందాయి. కన్నడ సాహిత్యానికి నాటక రంగానికి చేసిన కృషికి గాను 1999లో భారతదేశ అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న 7వ వ్యక్తిగా నిలిచారు.

Also Read: 550టైమ్స్‌.. రీ-రిలీజ్ మూవీ ఓం

నాటక రంగంలో చేసిన కృషికిగాను ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా గిర్నీష్ కర్నాడ్ నిలిచారు. తెలుగు కన్నడ హిందీ తమిళ మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా చేశారు. ఈయన చేసిన రచనలకు గాను భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ ఇచ్చారు. 1992లో పద్మభూషణ్ అవార్డులను ప్రధానం చేశారు. 2019లో గిర్నీష్ కర్నాడ్ బెంగళూర్‌లో తుది శ్వాస విడిచారు.

Also Read: Simhadri:వావ్.. రీరిలీజ్‌ లోనూ హౌస్‌ ఫుల్ బోర్డ్స్

- Advertisement -