గ్రీన్ ఛాలెంజ్‌: మహిళలకు మొక్కల పంపిణీ..

92
- Advertisement -

“అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని” పురస్కరించుకొని “గిగ్గిల్ మగ్ ఈవెంట్స్” ఆధ్వర్యంలో “విమెన్ లీడర్ షిప్ ఇన్ క్లైమెట్ ఛేంజ్” థీంతో శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అత్యంత అద్భుతంగా సాగిన విమెన్ 2K,5K రన్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ వివిధ రకాల మొక్కలను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కోఫౌండర్ రాఘవ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ రాధిక, గిగ్గీల్ మగ్ సంస్థ నిర్వాహకురాలు స్వాతి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధులు కిషోర్ గౌడ్, మురళి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -