‘మైఖేల్’లో వరుణ్ సందేశ్..

106
- Advertisement -

మైఖేల్ చిత్రం గురించి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది గురించి నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచీ చిత్రంపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వారంతా ఈ సినిమాలో ప‌నిచేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. హ్యాండ్సమ్, టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసా రి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం. ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది.

మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.

తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: రంజిత్ జయకోడి
నిర్మాతలు: భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పకుడు: నారాయణ్ దాస్ కె నారంగ్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చెర్రీ
PRO: వంశీ-శేఖర్

- Advertisement -