జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జగనుంది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ విప్ జారీచేసింది. మరోవైపు, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం తెలంగాణభవన్‌లో సమావేశం నిర్వహించునున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పార్టీ వ్యూహంపై సూచనలు ఇవ్వనున్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి విప్‌గా ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను పార్టీ నియమించింది. మంత్రి కేటీఆర్, పార్టీ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు, మంత్రి తలసాని ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నదని స్పష్టంచేశారు.