నిర్మాణ పనులను వేగవంతం చేయాలి- మేయర్

260
mayor
- Advertisement -

బాలానగర్ క్రాస్ రోడ్స్ -నర్సాపూర్ క్రాస్ రోడ్స్ మధ్య వున్న రహదారిలో రూ 387 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి, జిహెచ్ఎంసి. సిసిపి దేవేందర్ రెడ్డి, ఎ సి పి శ్రీనివాసదాస్, నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లుతో జిహెచ్ఎంసి కార్యాలయంలో నేడు ప్రత్యేకంగా చర్చించారు.

సివిల్ వర్క్స్ కు రూ.122 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భూ సేకరణ కింద చెల్లించుటకు చెక్కులు సిద్ధం చేసినట్లు తెలిపారు. అందుకు ప్రభుత్వం రూ. 265 కోట్లు కేటాయించినట్లు మేయర్‌ తెలిపారు. కోవిద్ -19 లాక్ డౌన్ పరిస్థితుల్లో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేనందున పిల్లర్ల పునాది పనులను వారంలోపు పూర్తి చేయాలని సూచించారు.పెండింగ్ లో వున్న 7 పిల్లర్స్ పనులు కూడా స్టాబ్ వరకు వస్తే, ట్రాఫిక్ కు ఆటంకం కలుగకుండా మిగిలిన పనులు పూర్తి చేయవచ్చునని పేర్కొన్నారు.

తదనుగుణంగా పనులు జరిగేందుకు అవసరమైన స్థాయిలో కార్పెంటర్లు, కార్మికులను సమకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. భూ సేకరణ చెల్లింపులకు నిధులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఆస్తిదారులకు నిర్మాణ స్థలంలోనే చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మేయర్ తెలిపారు.

- Advertisement -