మీడియాకు వ్యతిరేకం కాదు : సీఎం కేసీఆర్

117
kcr cm

విపత్కర సమయంలో కొన్ని పత్రికలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం..రాష్ట్రంలో ఔషధాల కొరత లేదని…ప్రభుత్వం వద్ద 40 వేల పీపీఈ కిట్లు ఉన్నాయని చెప్పారు.

5 లక్షల కిట్లకు ఆర్డర్ చేశామని…అందరం నిద్రలేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని అసత్యవార్తలు రాస్తున్నాయని ఇది మంచిది కాదన్నారు. తాను మీడియాకు వ్యతిరేకం కాదని రాజకీయాలకు బోలెడంత సమయం ఉందన్నారు.

లాక్ డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని…భారత్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదన్నారు.