గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే హవా.. ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..

183
trs win
- Advertisement -

డిసెంబ‌ర్ 1న జ‌రిగిన గ్రేటర్‌ ఎన్నిక‌ల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది అనగా 46.55 శాతం పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. కాగా గురువారం మ‌ల‌క్‌పేట్ డివిజ‌న్‌లో రీ పోలింగ్ ముగిసిన అనంత‌రం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి అయ్యాయి. ఈ నేపథ్యంలో బల్దియా పీఠాన్ని హైదరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే క‌ట్ట‌బెట్టిన‌ట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి.

పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కారం.. టీఆర్ఎస్ 68 -78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 1-5 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

సీపీఎస్ స‌ర్వే ప్ర‌కారం.. టీఆర్ఎస్ కు 82 -96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు గెలుపొందే అవ‌కాశం ఉంది.

థ‌ర్డ్ విజ‌న్ స‌ర్వే ప్ర‌కారం.. టీఆర్ఎస్ పార్టీకి 95-101 డివిజ‌న్ల‌లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవ‌కాశం ఉంది.

ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. టీఆర్ఎస్‌కు 78(+/-7), బీజేపీ 28(+/-5), మ‌జ్లిస్ పార్టీ 41(+/-5), కాంగ్రెస్ 3(+/-3) స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

టీఆర్ఎస్ కు 40.08 శాతం(+/-3%), బీజేపీ 31.21 శాతం(+/-3%), మ‌జ్లిస్ పార్టీ 13.43 శాతం(+/-3%), కాంగ్రెస్ 8.58 శాతం(+/-3%), ఇత‌రుల‌కు 7.70 శాతం(+/-3%) ఓట్లు పోలైన‌ట్లు అంచ‌నా వేసింది.

- Advertisement -