స్క్రాప్‌ సేక‌ర‌ణకు విశేష స్పంద‌న‌..

434
- Advertisement -

ఇంట్లో ఉన్న‌ ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌కై జిహెచ్ఎంసి చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు న‌గ‌ర‌వాసుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. త‌మ ఇళ్ల‌లో ఉన్న నిరుప‌యోగ వ‌స్తువుల‌ను ఎక్క‌డ వేయాలో తెలియ‌క‌, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు ప‌డుతున్న న‌గ‌ర‌వాసుల‌కు ఇంటి వ‌ద్ద‌నుండే సేక‌రించే కార్య‌క్ర‌మాన్ని జిహెచ్ఎంసి చేప‌ట్టడంతో ఎన్నో ఏళ్ల నుండి త‌మ ఇళ్ల‌లో ఉన్న నిరుప‌యోగ వ‌స్తువుల‌ను పెద్ద ఎత్తున అంద‌జేస్తున్నారు.

12వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ డ్రైవ్‌లో ఇళ్ల‌లో వృథాగా ఉన్న పాత వ‌స్తువులు, కూల‌ర్లు, ప‌రుపులు, మెత్త‌లు, ప‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇత‌ర నిరుప‌యోగ వ‌స్తువుల‌ను సేక‌రిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 42.336 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను సేక‌రించారు. నేడు ఒక్క‌రోజే 1.883 ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు, 7.821మెట్రిక్ ట‌న్నుల విరిగిన ఫ‌ర్నీచ‌ర్లు, 4.073 మెట్రిక్ ట‌న్నుల ప‌నికిరాని ప‌రుపులు, మెత్త‌లు, 1.651 మెట్రిక్ ట‌న్నుల ప్లాస్టిక్ స‌మాను, 0.005 మెట్రిక్ ట‌న్నుల హానిక‌ర వ‌స్తువులు, 5.245 మెట్రిక్ ట‌న్నుల ఇత‌ర వస్తువుల‌ను జిహెచ్ఎంసి సేక‌రించింది.

Scrap Collection Drive

సోమవారం ఖైర‌తాబాద్ స‌ర్కిల్ సోమాజిగూడ‌లోని దుర్గాన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన నిరుప‌యోగ వ‌స్తువుల‌ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. త‌మ ఇళ్ల‌లోని ప‌నికిరాని వ‌స్తువులను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వేయ‌కుండా జిహెచ్ఎంసికి అంద‌జేయాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు జరిగే ఈ స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా ఆయా కాల‌నీల‌కు జిహెచ్ఎంసి వాహ‌నాలు వ‌స్తాయని లేదా ఎంపిక‌చేసిన స్థ‌లాల్లోనూ ఈ అన‌వ‌స‌ర వ‌స్తువుల‌ను వ‌దిలివెళ్లాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ విజ్ఞ‌ఫ్తి చేశారు.

న‌గ‌రంలో ఈ ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటిని ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారని, త‌ద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావ‌డంతో రోడ్ల‌పై మురుగునీరు పొంగ‌డం, నాలాల ద్వారా నీరు స‌క్ర‌మంగా ప్ర‌వ‌హించ‌కుండా ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అవుతున్నాయ‌ని మేయ‌ర్ పేర్కొన్నారు.

గ‌త రెండు రోజులుగా సేక‌రించిన వ్య‌ర్థాలు..

ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు – 2.027 మెట్రిక్ ట‌న్నులు
విరిగిన ఫ‌ర్నీచ‌ర్ – 14.485 మెట్రిక్ ట‌న్నులు
పాత ప‌రుపులు, మెత్తలు – 11.281 మెట్రిక్ ట‌న్నులు
ప్లాస్టిక్ వ్య‌ర్థాలు – 3.329 మెట్రిక్ ట‌న్నులు
హానిక‌ర వస్తువులు – 0.010 ఎంటీ
ఇత‌ర వ‌స్తువులు – 11.399 మెట్రిక్ ట‌న్నులు

- Advertisement -